మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మహిళ మృతి చెందినదని టూటౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ధనావత్ సేవ్య, తన భార్య ధనావత్ కమల తో కలిసి యాక్టివా స్కూటీ పై మిర్యాలగూడ పట్టణానికి బయలుదేరి మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో, నల్గొండ వైపు నుండి వాడపల్లి వైపు వెళ్తున్న కంటైనర్ వాహనం అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ యాక్టివాస్కూటీని ఢీకొట్టాడని తెలిపారు. ఈ ప్రమాదంలో యాక్టివా స్కూటీపై వెనుక కూర్చున్న ధనావత్ కమల తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినదని అన్నారు. స్కూటీ నడుపుతున్న ధనావత్ సేవ్యకు ముఖం ఎడమ వైపు, ఎడమ కాలి మడమ వద్ద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం కంటైనర్ వాహనం డ్రైవర్వాహనాన్ని ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడని, ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్వాహనం డ్రైవర్‌ను గుర్తించి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని టూటౌన్ పోలీసులు తెలిపారు.