తెలుగు  ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన బాబు, పవన్ 

  • సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విశ్వంభర; ఏ పీ బ్యూరో :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని, ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూ భజన చేయటం సిగ్గుచేటని, కేవలం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృథా చేయటం తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.  ఈ మేరకు ఆయన  నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించి, ఆయనతో ప్రారంభించడం అందరూ స్వాగతించాల్సిందే. అందుకుగాను ఎన్నడూ లేనట్లుగా 30, 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 2, 3 లక్షల మంది జనాభాను సమీకరించడం, అంత పెద్ద ఎత్తున హంగామా చేయటం పక్కా పొలిటికల్ డ్రామాగా గోచరిస్తున్నది. రాజకీయంగా ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చేపట్టిన ఈవెంటే ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆయన ఇంటి వద్ద, పార్లమెంటు వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని 'మోడీ డౌన్ డౌన్' అంటూ నిరసన తెలుపుతున్నారనేది అక్షర సత్యం. కానీ ఏపీలో చంద్రబాబు, పవన్ లు మోడీని పొగడ్తలతో ముంచెత్తటం  అవివేకం. మోడీ కనీసం పార్లమెంట్లో జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎంలు మోడీని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకే రాకుండా అసలు ముఖం చాటేసారు. ప్రతిపక్షాలు అడిగి ప్రశ్నలకు సమాధానాలు లేవు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఒక కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం మోడీ వాళ్ళను పరామర్శించిన పాపాన పోలేదు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మోడీ పట్ల ఎటువంటి హంగామా చేయడం లేదు. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి, ప్రజాధనం వృధా చేయటం, మోడీకి భజన చేయటం దుర్మార్గం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దేశ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మోడీ హయాంలో దేశం ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని బాకాలు ఊదటం సిగ్గుపడాల్సిన విషయం. దేశంలో మోడీ పాలనలో పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతున్నాయి. మోడీ పాలనలో విద్యార్థులకు పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక పోయారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు. రైతు సమస్యలు పరిష్కరించలేకపోయారు. అధిక ధరలు తగ్గించలేకపోయారు. పెద్ద ఎత్తున అవినీతి జరగటం, బ్లాక్ మనీ పెరిగిపోవడం వంటివి తారాస్థాయికి చేరాయి. మోడీ హయాంలో దేశాన్ని అప్పుల పాల్జేశారు. రూపాయి విలువ పడగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అభాసపాలు చేశారు. మొన్నటి వరకు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని బెదిరించిన మోడీ గ్రాఫ్ పడిపోయింది. రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలె అధ్వానంగా దిగజారి పొగిడే వారిని గతంలో ఎన్నడు చూడలేదు. తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి సీఎం, డిప్యూటీ సీఎం కల్పించడం శోచనీయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీకి తాకట్టు పెడుతున్నారు. స్వార్థపర రాజకీయాల కోసం దేశంలో ఏమాత్రం జరగని అభివృద్ధిని జరిగినట్లుగా బాగా ఊదుతున్నారు. నరేంద్ర మోడీ లాంటి పనికిమాలిన ప్రధానిని ఇంతవరకు చూడలేదని దేశమంతా కోడై కూస్తున్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రికి పట్టకపోవడం విచారకరం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లు అవాస్తవాలు ప్రచారం చేయడం తగదు. గత 12 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ కాలంలో దేశానికి ఏం ఒరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు మోడీని పదేపదే పొగడ్తలతో ముంచేత్తడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/babu-pawan-pledged-telugu-self-respect-to-modi/article-20858

Tags: