అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

విశ్వంభర   హుస్నాబాద్ : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా  కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతిక అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా  శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటున్నాం అని రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని, బోనాల ఉత్సవాల్లో కులాలకతీతంగా మతలకతీతంగా భాగస్వామ్యమై జరుపుకుంటారని తెలిపారు . ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక విపత్తులు వచ్చిన అమ్మవారు ఆదుకున్నారని,ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి ఆకాంక్షించారు. ఇప్పుడు కూడా ఎల్ నినో విపత్తు వచ్చినా.. ఇలాంటి ఇబ్బందులు కలగవద్దని బోనాల ఉత్సవాల సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-ponnam-prabhakar-presented-the-first-bonam-to-amma/article-20879

Tags: