మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత నీలం మధు 

విశ్వంభర, మహేశ్వరం: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్ట స్థానం ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఆయన ఆదివారం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్‌కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేందర్, ఈశ్వర్, మల్లేష్, హరికృష్ణ, ఎట్టయ్య, జంగయ్య, యాదయ్య, కుమార్, పరమేశ్, నరేష్, శ్రీను, కావలి జంగయ్య, మహేష్, శివరామకృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు, జాతర నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leader-neelam-madhu-visited-goddess-mahankali/article-20837

Tags: