వైభవంగా భవాని మాత కోటమ్మ తల్లికి బోనాలు
విశ్వంభర, పెద్ద శంకరంపేట: ఆషాఢ మాసం పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలో భవాని మాత అమ్మవారికి బూరుగుపల్లి గ్రామంలోని కోటమ్మ తల్లి అమ్మవారికి ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు. భాజా భజంత్రీలతో మహిళలు బోనాలు ఎత్తుకొని భవాని మాత అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయంలో ఉదయం నుండి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుతో భవాని మాత అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ పెరుమాండ్లు గౌడ్ మాజీ సర్పంచులు సరితా మల్లేశం కాశీరాం ఆలయ కమిటీ ధర్మకర్తలు శ్రీనివాస్,సంతోష్ కుమార్, శివకుమార్, సుభాష్, అశోక్ ఆనంద్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.