గుగులోతు హున్య మృతి పట్ల బీఆర్ఎస్ నాయకుల సంతాపం
విశ్వంభర, హుస్నాబాద్: అక్కన్నపేట మండలం పెద్దతండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్ తాత గుగులోతు హున్య మృతి చెందడంతో హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్ రెడ్డి, వికాస్, రామకృష్ణ, రాజు నాయక్, యాస శ్రీనివాస్, గుగులోతు రాజు నాయక్ తదితరులు బాధిత కుటుంబాన్ని ఓదార్చి, గుగులోతు హున్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు