బోనాల సంబరాలకు మూడు కాలనీలు  సిద్ధం 

బోనాల సంబరాలకు మూడు కాలనీలు  సిద్ధం 

విశ్వoభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డిగూడ, మారుతీనగర్, శ్రీనిధి నెస్ట్ కాలనీలలో ఈ నెల 9న బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాలనీల పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించి తీర్మానం చేశారు. మూడు కాలనీల ప్రజలంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు  ఈ సమావేశంలో కంది ప్రవీణ్ కుమార్, మడిపడిగె ఆంజనేయులు, మడిపడిగె రాజ్‌కుమార్, లంబ శ్రీనివాస్ యాదవ్, మెడబోయిన సంజీవ్ ముదిరాజ్, వై. నితిన్ రెడ్డి, జి. సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/three-colonies-are-ready-for-bonala-celebrations/article-20831

Tags: