ఇబ్రహీంపట్నం బీరప్ప గుడి, ఓం శక్తి నగర్‌లో తొలిసారి  వేడుకలు

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ నలుమూలలా అమ్మవారి జాతరలు ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీరప్ప గుడి, ఓం శక్తి నగర్ కాలనీ లో మహంకాళి బోనాల ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కాలనీ ఆవిర్భవించిన నాటి నుండి తొలిసారిగా బోనాల ఉత్సవాలు జరగడం విశేషం. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను దన్నే రాజు ఆధ్వర్యంలోని యువకులు, కాలనీ పెద్దలు సమిష్టిగా తీసుకున్నారు. ఉదయం నుండే కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు కొత్త చీరలు ధరించి, పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించిన బోనాలను తలపై పెట్టుకున్నారు. డప్పుల చప్పుళ్లు, పోతురాజుల వీర నృత్యాలు, కోలాటాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ బోనాల ఉత్సవాలకు మాజీ కౌన్సిలర్ మమత ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనం సమర్పించి, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, కాలనీలో శాంతి సుభిక్షాలు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో  కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, భాస్కర్ నాయక్, ధనపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, కృష్ణ గౌడ్, మంకాల శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట గిరి తదితర నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కాలనీ మొత్తం తోరణాలు, రంగవల్లులతో సరికొత్త శోభను సంతరించుకుంది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను మమత ఆనంద్ కుమార్ అభినందించారు. రానున్న రోజుల్లో ప్రతి ఏటా ఇంకా ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీ అభివృద్ధి చెందాలని భక్తులు మొక్కులు చెల్లించారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mahankali-bonas-in-full-glory/article-20928

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి