బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
విశ్వంభర, పెద్ద శంకరంపేట: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నారాయణఖేడ్ పట్టణంలోని కట్ట మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, అనంతరం శంకరంపేట్ (ఏ) మండలం బూరుగుపల్లి గ్రామంలోని కోటమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, మాజీ రైతు సమితి అధ్యక్షుడు సురేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ షెత్కార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సేట్, కురుమ సంఘం తాలూకా అధ్యక్షుడు ప్రభాకర్ కురుమ, సర్పంచులు కోణం అంజయ్య, విట్టల్ నాయక్, మాజీ సర్పంచులు మల్లేష్, శంకర్ గౌడ్, రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ దత్తు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకల గోపాల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.