ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభ

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభ

విశ్వంభర, హిమాయత్ నగర్ : గద్దర్ మూడవ వర్ధంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించనున్న స్మారక సభ పోస్టర్‌ను సోమవారం హైదరాబాదు హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి జీవి సూర్య కిరణ్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గద్దర్ ప్రజా యుద్ధ నౌకగా తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాట, మాటతో ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. గద్దర్ స్ఫూర్తితో జిల్లాల్లో అనేక సాంస్కృతిక దళాలు ఏర్పడి తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక సంస్థ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gaddar-vardhanti-sabha-on-6th-august/article-20864

Tags: