దేశంలో దోపిడి శక్తులు బలపడుతున్నాయి: ప్రొ. తోట జ్యోతిరాణి
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : దేశంలో ఆర్థిక, సామాజిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతోంది, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలపై చర్చ, చైతన్యం అవసరమని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తరిమెల నాగిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన "మ్యాన్ ఆఫ్ ది ఎర్త్" డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ప్రొ. జ్యోతిరాణి మాట్లాడుతూ రక్షణ వ్యయం పెరుగుతున్నప్పటికీ శాశ్వత సైనిక నియామకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. అగ్నివీర్ విధానంపై పునరాలోచన అవసరమని, యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే విధానాలు అమలు చేయాలని సూచించారు. పారిశ్రామికాభివృద్ధి మందగించడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, సేవారంగంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, ప్రజల జీవనోపాధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇచ్చే విధానాలు అవసరమన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు యువత సామాజిక చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీఎన్‌ఎం ట్రస్ట్ చైర్మన్ ఎస్. ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు శుభోద్ మిత్ర, గుర్రం విజయ్‌కుమార్, సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, ఏపీటీఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు, డా. గంట వెంకటరావు, ఇండ్ల విజయసారధి, పి. కోటిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు