ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి: సిర్పంగి స్వామి

విశ్వంభర, వలిగొండ: ఆగస్టు 10న జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిర్వహించనున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి పిలుపునిచ్చారు. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. నూతన లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకంలో మార్పులు, కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు వాకిటి వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు దొడ్డి బిక్షపతి, సీఐటీయూ నాయకుడు వడ్లకొండ శంకరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/august-10-sirpangi-swamy-should-succeed-jail-bharo/article-20866

Tags: