ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు
విశ్వంభర, హైదరాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు కూడా ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని మహంకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొంటూ, ఈ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక భావనలను మరింత పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు