శ్రీనివాస్ నగర్ వెల్ఫేర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా తోటకూర చందర్ యాదవ్
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా మాజీ ఎంపీటీసీ సభ్యులు తోటకూర చందర్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన కాలనీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో కాలనీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కాలనీలో ఉన్నటువంటి సమస్యలను వివరించారు. ప్రొఫెసర్ ఆంజనేయులు, డాక్టర్ బి రామచంద్రం, గంగాధర్ లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. ఈ సందర్భంగా వారు ఆహ్లాదకర వాతావరణంలో సమావేశాన్ని నిర్వహించి కాలనీ వాసుల అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా తోటకూర చందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా వేములూరి మురళీధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తోటకూర చందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, అందరి సహకారులతో కలిసి కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతానని అన్నారు. కాలనీ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికై అహర్నిశలు శ్రమిస్తాన స్పష్టం చేశారు.కాలనీలో రోడ్లు, డ్రైనేజీ,త్రాగునీటి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చందర్ యాదవ్ వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాలనీ వాసుల అందరికీ చందర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తోటకూర చంద్ర యాదవ్ కు కాలనీ వాసులతో పాటు స్నేహితుల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.