తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, మీర్‌పేట్: తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర నాలుగో మహాసభలు, ఠాను నాయక్ నంగారా ఉత్సవాల పోస్టర్‌ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి, ఓబీసీ నాయకుడు ఆకుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "స్వయం పాలన – సంస్కృతి పరిరక్షణ – హక్కుల కోసం పోరాటం" అనే నినాదంతో నిర్వహిస్తున్న మహాసభలు గిరిజనుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అమరవీరులు కొమురం భీమ్, రామ్జీ గోండ్, ఠాను నాయక్ ఆశయాలను కొనసాగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు, ఓబీసీల సంక్షేమానికి ప్రాధాన్యత లభించిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలు, ఠాను నాయక్ నంగారా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, గిరిజన, ఓబీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-tribal-association-state-mahasabha-poster-unveiling/article-20852

Tags: