తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
150 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానం
విశ్వంభర, హనుమకొండ: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేలా, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం అన్నారు. వరంగల్ ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాలలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జశుబాయి హీరాబాయి చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చైర్మన్ తాళ్ల మల్లేశం మాట్లాడుతూ, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. విద్య అనేది ఉద్యోగ సాధనకే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజ నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం, విద్యార్థులకు నూతన సిలబస్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, కృషి, నైతిక విలువలతో ముందుకు సాగితే ఉన్నత విద్య, ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంలో విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన 150 మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. డిగ్రీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తాళ్ల వరుణ్, తాళ్ల వంశీ, ప్రిన్సిపాల్ జూపల్లి వెంకటేశ్వరావు, కాకతీయ విశ్వవిద్యాలయం కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డీన్ ప్రొఫెసర్ పి. వరలక్ష్మి, యూనివర్సిటీ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్, రెవరెండ్ ఫాదర్ జి. చిన్నప్పరెడ్డి, పూర్వ విద్యార్థి డా. కె. రవితేజ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.