ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం
విశ్వంభర, రామన్నపేట: ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం హైదరాబాదు పరిధిలోని హకీంపేటలోని జూపల్లి బాలమ్మ కన్వెన్షన్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు, యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు మణికొండ రాఘవేంద్రరావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యదాద్రి వెలమ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన పనకంటి భాస్కర్ రావు, కార్యదర్శి పొనుగోటి కృష్ణారావులు పూల బొకేలు అందించి శాలువాలతో సత్కరించారు. రెండవ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయ సమీపంలో వెలమలకు చౌల్ట్రీ ఏర్పాటు చేసుకునేందుకు స్థలం ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా మెమోరాండం అందించారు. దీనికి వారిరువురు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పొనుగోటి లోకేశ్వరరావు, మాడూరి ప్రభాకర్ రావు, వీరమనేని సురేష్, పనకంటి సుమన్, కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు