ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన

15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 15రోజుల పాటు లండన్ వెళ్లిన ఆయన తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్ జగన్, భార్య భారతితో కలసి ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా పర్యటించారు. లండన్ నుంచి జగన్ తన కుమార్తెలతో కలసి స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. 15రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో లండన్‌ నుంచి బయల్దేరనున్న జగన్‌ నేరుగా గన్నవరం చేరుకున్నారు. కాగా, జగన్ రావడంతోనే కౌంటింగ్‌ డేకు సంబంధించి కరసత్తును ప్రారంభించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Related Posts