సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ తేదీలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రమాణస్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్లు తెలుస్తోంది. బోయపాటి చంద్రబాబుతో పాటు, బాలయ్యకు అత్యంత సన్నిహితడనే విషయం తెలిసిందే.