సూపర్ సిక్స్ తో పేదరికాలాన్ని నిర్మూలిస్తాం 

సూపర్ సిక్స్ తో పేదరికాలాన్ని నిర్మూలిస్తాం 


  • : నరాల సత్యనారాయణ

విశ్వంభర, బషీర్ బాగ్  : తెలంగాణలో తమ సూపర్ సిక్స్ మేనిఫెస్టో తో ప్రజల పేదరికాన్ని అంతం చేస్తామని తెలంగాణ రక్షణ సమితి (టిఆర్ఎస్ డి) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఇతర నేతలతో కలిసి సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, బహుజన వాదం తమ ఎజెండాగా తెలిపారు. కవిత  పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన కాదని రాక్షస సేనగా అభివర్ణించారు. ఆమె తెలంగాణ ప్రజలను దోచుకునేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పారు. లిక్కర్ కుంభకోణంలో వేలకోట్లు సంపాదించిందని అన్నారు. తెలంగాణ జాగృతి పేరిట జనాలను మోసగించిన నేతగా ఆమెను విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు లక్షల కో ట్లు దోచుకొని తెలంగాణను లూటీ చేశాడని ఆరోపించారు. తమ పార్టీకి ఆయు పట్టు మహిళలేనని స్పష్టం చేశారు. కే జీ టు పీజీ ఉచిత విద్య, రూ .35 వేల కోట్లతో మహిళా సంక్షేమ నిధి, 450 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి ఆరువేల ఇండ్లు నిర్మాణం , ప్రతి మహిళకు 20 రకాల నిత్యవసర సరుకులను రూ 25 రూపాయలకే అందజేయడం , వెలుగు పథకం ద్వారా ఐదు గ్యాస్ సిలిండర్ ఏడాదికి ఉచితం, అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటోడ్రైవర్లకు ప్రతినెల 15 వేల రూపాయలు, 42 వేల జయశంకర్ క్యాంటీన్ లు, మూడు లక్షల రుణమాఫీ వంటివి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆనందబాబు, స్వరూప, నర్సింగ్, సురేఖ, నగేష్, మారుతి జైపాల్ , భరత్ రెడ్డి, లక్ష్మీ ,లావణ్య తదితరులు పాల్గొన్నారు

Tags: