రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్న వై.అక్షయ యు అండ్ మి సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. ఆదివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల విద్యా కమిషనర్ దేవసేన చేతుల మీదుగా బహుమతి స్వీకరించడం చాలా ఆనందించదగ్గ విషయమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం అన్నారు. తమ కళాశాలలో చదివే విద్యార్ధిని రాష్ట్ర స్థాయి పోటీలో విజేతగా రాణించి బహుమతి సాధించడం తమ కళాశాలకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన వై.అక్షయను కళాశాల అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు అభినందించారు.



