20 క్వింటాళ్ల బెల్లం,100 కేజీ ల పటిక పోలీసులు పట్టివేత
- 20 క్వింటాళ్ల బెల్లం,100 కేజీ ల పటిక పోలీసులు పట్టివేత
విశ్వంభర, నెల్లికుదురు: అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక, నాటు సారాను ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో శనివారం ఉదయం పెట్రోలింగ్ చేస్తూ పార్వతమ్మ గూడెం క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా 20 క్విం.ల సారాయికి ఉపయోగించే నల్ల బెల్లం,100 కేజీ ల పటిక, 10 లీటర్ల నాటు సారాయి తరలిస్తున్న అశోక లేలాండ్ ట్రాలీ, పాసింజర్ ఆటో కనబడ్డాయి.వెంటనే వాటిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. బెల్లం విలువరు రూ.2లక్షలు కాగా, పట్టిక రూ.10 వేలు, నాటు సారాయి రూ. 4 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. సంబంధిత చట్ట వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడుతున్న తొర్రూరు మండలం లచ్చు తండాకు చెందిన జాటోతు విశాల్, అదే మండలం టీక్యతండాకు చెందిన జాటోత్ సునీల్, లచ్చుతాండకు చెందిన వాంకుడోత్, కర్ణాటక రాష్ట్రం బీదర్ కామ్ తాన కు చెందిన మహమ్మద్ అమీర్ ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఇందులో ఒకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కాగా వీరు బీదర్ నుంచి బెల్లం, పట్టిక తీసుకువచ్చి సారాయి తయారుచేసి నెల్లికుదురు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నారన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, వెతికి పట్టుకొని చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



