చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
On
విశ్వంభర, ఢిల్లీ : బీసీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ తెలిపారు. శనివారం మైసూర్ యువరాజు, పార్లమెంట్ సభ్యుడు యధూవర్ కృష్ణ దత్త చమరాజను కలిసి చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఢిల్లీలో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. బీసీల డిమాండ్ల సాధనకు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు సమీకరిస్తామని స్పష్టం చేశారు.



