డ్రగ్స్ పట్టుకున్న ఎక్సైజ్ టీమ్‌లకు నగదు ప్రొత్సహాకాలు
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం చేతుల మీదుగా ప్రధానం
విశ్వంభర, జిహెచ్ఎంసి : ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీములు బాగా పని చేసి ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకు రావాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం పిలుపు నిచ్చారు. గంజాయి, డ్రగ్స్ పట్టుకున్న 20 ఎక్సైజ్ టీమ్‌లకు ఆబ్కారీ భవన్ లోని డైరెక్టర్ చాంబరులో శనివారం నగదు ప్రొత్సహాకాలను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం చేతుల మీదుగా అందజేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టూ స్టేషన్‌లో 30.96 కేజీలు, ఖమ్మం వన్ స్టేషన్‌లో 23.6 కేజీలు, మధిరలో 22 కేజీలు, కొత్తగూడేం భద్రాచలంలో 43 కేజీలు, 30.6 కేజీలు,24.9 కేజీలు, 23.8 కేజీలు, 21.3 కేజీలు, 20.8 కేజీలు మొత్తంగా 265.96 కేజీలు గంజాయి పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లకు, ఎక్సైజ్ సిబ్బంది నగదు బహుమతి అందించారు. ధూళ్‌పేట్‌లో 21.425 కేజీల, హైదరాబాద్‌లో 1920 కేజీల గంజాయి చాక్లెట్లు కేసుల్లో ఆయా టీమ్ డైరెక్టర్ నగదు ప్రొత్సహాకాలు ఇచ్చారు. మొత్తం 12 గంజాయి కేసుల్లోను 8 డ్రగ్స్ కేసుల్లో నగదు రివార్డులు అందించారు.సంగారెడ్డిలోని జాహీరాబాద్‌లో 46.020 కేజీల నిట్రా జిప్సమ్, నిజామాబాద్‌లో 2.020 కేజీల ఓపీఎం, నిజామాబాద్‌లో 609 గ్రాముల ఆల్పోజోలం, కాచిగూడలో 113 ఎలఎస్‌డి బాస్ట్స్, చార్మీనార్‌లో 1920 కేజీల గంజాయి చాక్లెట్లు, నారాయణగూడలో 33.3 గ్రాముల కోకైన్, ఆమీర్‌పేట్‌లో 14.83 ఎండిఎంఎ , ధూల్‌పేట్‌లో 12.29 గ్రాముల ఎండిఎంఎ కేసుల్లో నగదు ప్రోత్సాహక రివార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటివ కమిషనర్ ప్రణవీలు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్,ఎక్సైజ్ టీమ్‌ల సీఐలు సిబ్బంది పాల్గొన్నారు.



