ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ లోని పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి హాజరై తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలలు వేసి బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ, కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసారు. 1200 మంది విద్యార్థుల బలిదానం కేసీఆర్ దీక్ష పలం వళ్ళనే తెలంగాణ సాధించుకున్నామని, అట్టి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ గతి పిత (బాపు)గా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, అబద్ధపు మాటలు ప్రచారం చేసి అధికారంలోకి  వచ్చిందని,కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు  జరుగుతుందని, మళ్లీ త్వరలోనే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని,కెసిఆర్ ముఖ్యమంత్రిగా అవుతారని మంద సంజీవరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరాయనీ, కానీ నేటి ప్రభుత్వం ప్రజలను మసిపూసి మారేడు కాయ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ  మాజీ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు, కొత్త రవి గౌడ్, జడిగె రమేష్, కోటపల్లి రామచంద్రారెడ్డి, కాటంరాజు రెడ్డి, బొమ్మకు విశ్వనాధ్, చక్రపాణి గౌడ్, బంగారం నాగేష్ గౌడ్ సదానంద్, యూత్ నాయకులు బంగారం శ్రీధర్ గౌడ్, ఉప్పరి విజయ్, చిన్ని గల వినయ్,రసాల మహేష్, విజయ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags: