డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల  మరమ్మతు పనులు వేగవంతం చేయండి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల  మరమ్మతు పనులు వేగవంతం చేయండి

  • - ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

విశ్వంభర, మిర్యాలగూడ :  మిర్యాలగూడలో లబ్ధిదారులకు  అతి త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ తెలిపారు. శనివారం రోజున  డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి, ఎలక్ట్రీసిటీ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ, అతి త్వరలో లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కావున పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలి అని అదేశించారు. రోడ్లు, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ లాంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా పనులు పూర్తిచేయాలి అని సూచించారు. పనులను అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఆర్ అండ్ బి  మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: