డ్రైనేజ్ పైప్ లైన్ మరమ్మతులు
On
విశ్వంభర, హైదర్ నగర్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోగల సమతా నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా మంజీరా పైప్ లైన్లోకి డ్రైనేజ్ పైప్ లైన్ నుంచి నీరు కలవడంతో కాలనీవాసులు అనారోగ్యాల పాలై ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే స్థానిక కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావుని కాలనీవాసులు కలిసి విషయం తెలపగా స్పందించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి అధికారులను, జలమండలి అధికారులను పిలిపించి సమస్యను తెలుసుకొని వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీవాసులు . డీజీఎం శ్రీనివాస్ రాజు, మేనేజర్ విలియమ్స్ ప్రకాష్ నరేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.



