యువజన సంఘం కమిటీ రద్దు చేయాలి 

యువజన సంఘం కమిటీ రద్దు చేయాలి 

విశ్వంభర, కడ్తాల్: కడ్తాల్ మండలానికి చెందిన బీసీ యువజన సంఘం ప్రస్తుత కమిటీని తక్షణమే రద్దు చేసి, నూతన కమిటీని ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుత కమిటీ 2016 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. అప్పటి నుండి దాదాపు పది సంవత్సరాల కాలం పూర్తవడంతో సంఘ అభివృద్ధి, పారదర్శకత,  యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో, కొత్త కమిటీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేయడం అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్  ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు కేశని మహేష్,  అధ్యక్షులు  మాదారం మహేష్ గౌడ్ ,  ఉపాధ్యక్షులు  రజనీకాంత్ కమ్లికర్, బోసు రవి, చిప్ప రాజు జనరల్ సెక్రటరీ  ఎగిరిశెట్టి శ్రీకాంత్ , ఇట్టి కార్యక్రమంలో దుడ్డు నాగరాజు, కానుగుల గణేష్ , కంది కంటి రాజేందర్ గౌడ్ మణి కిరణ్ గంజి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: