ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం 

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం 

విశ్వంభర, గౌలిపుర:- కన్యక పరమేశ్వరి ట్రస్ట్ భవనం లాల్ దర్వాజా గౌలిపుర లో కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బస్తీలో  అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌలిపుర మాజీ కార్పొరేటర్ ఆలేజితేందర్, కాంగ్రెస్ పిసిసి సెక్రెటరీ వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ సభ్యులు చీల రాములు గుప్తా చైర్మన్, సరాబు విశ్వేశ్వరయ్య గుప్తా ప్రధాన కార్యదర్శి, గుగ్గిళ్ళ  అశోక్ కుమార్ గుప్తా వైస్ చైర్మన్ బోనగిరి భాస్కర్ గుప్తా కోశాధికారి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, సరాబు సంతోష్ కుమార్ గుప్త అధ్యక్షులు, చాలికే నాగరాజు గుప్తా  ప్రధాన కార్యదర్శి, గుగ్గిళ్ళ సంతోష్ కుమార్ గుప్తా  కోశాధికారి, బలుస రవికుమార్ గుప్తా అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్, కటకం సతీష్ గుప్తా అడిషనల్ జనరల్ సెక్రెటరీ, పెద్ది నాగేష్ గుప్త అడిషనల్ కార్యదర్శి, చాలికి శివకుమార్ గుప్త అడిషనల్ వైస్ ప్రెసిడెంట్, మరియు కుల బాంధవులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Tags: