నిరంతర అధ్యయనంతో సమాజానికి సేవ చేయాలి

నిరంతర అధ్యయనంతో సమాజానికి సేవ చేయాలి

విశ్వంభర, బర్కత్ పుర : నైతిక విలువలను పాటిస్తూ నిరంతర అధ్యయనంతో సమాజానికి సేవ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ డీన్, సీనియర్ ప్రొఫెసర్ డి. శ్రీరాములు అన్నారు. తెలంగాణ యువతి మండలి స్కూల్ ఆఫ్ బిజినెస్ 15వ స్నాతకోత్సవం శుక్రవారం హైదరాబాదు బర్కత్పురలోని తెలంగాణ యువతి మండలి హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక విద్యార్థుల విద్యా ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సినీనటి ఆశ్రిత వేముగంటి, తెలంగాణ యువతి మండలి చైర్‌పర్సన్ పద్మజ మల్లికార్జున్ నూతన ఆలోచనలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మహిళా సాధికారతలో నాణ్యమైన విద్య కీలకమని తెలిపారు. కరస్పాండెంట్ డాక్టర్ కే. సునీల్ కుమార్ సంస్థ అభివృద్ధి, విద్యా ప్రగతిపై వివరాలు వెల్లడించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న రేఖ వార్షిక నివేదికను సమర్పించి ఎంబీఏ విద్యా విజయాలు, ప్లేస్మెంట్లు, సహపాఠ్య కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం అతిథుల చేత పట్టాల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పల్లవి, మల్లికార్జున్, రోహిత్ తదితర అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: