కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేత 

కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేత 

  •  తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

విశ్వంభర, సూర్యాపేట: ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాలకు వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో  సూర్యాపేట శాసన సభ్యులు జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 701మంది లబ్ధిదారులకు రూ.7.02కోట్ల విలువైన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి, ఏఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: