మంథని–ముత్తారం ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జిగా గాండ్ల మోహన్ నియామకం

విశ్వంభర, ముత్తారం: మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలానికి సమగ్ర ఓటరు ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ఇన్‌చార్జిగా కమాన్‌పూర్ మండలానికి చెందిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గాండ్ల మోహన్‌ను నియమించారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఏఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటరు దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇన్‌చార్జిలను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాండ్ల మోహన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/appointment-of-gandla-mohan-as-in-charge-of-manthani-muttaram-sir/article-19884

Tags: