ఘనంగా వనభోజనాల మహోత్సవం.

హాజరైన పద్మశాలి నాయకులు మెరుగు అశోక్.

ఘనంగా వనభోజనాల మహోత్సవం.

విశ్వంభర, హనుమకొండ :-వరంగల్ ఖిలా వరంగల్ సమీపంలోని చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రవేశ ద్వారం,వాకింగ్ మైదానంలో ప్రతీ సంవత్సరం మాదిరిగా జరిగే పద్మశాలీ కుల బందువుల కార్తీక వనబోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంటెస్ట్ కార్పోరేటర్ మెరుగు అశోక్ పద్మశాలీ  నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలు సంఘటితంగా ఐకమత్యంగా ఉండాలని కోరారు. వరంగల్ జిల్లాలో జరిగిన పద్మశాలీ కుల బంధువుల వనబోజనాల కార్యక్రమం విజయవంతమైందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారని వారిలో చైతన్యం వచ్చిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పద్మశాలీ చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు,ముడి పదార్థాలు, జిఎస్టీ అందటం లేదని,జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని కోరారు.,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఉందని,నిరుద్యోగులకు ఉపాధి కోసం టెక్స్టైల్ డిజైనరి ఇంజనీరింగ్ కాలేజీ ని వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరతామని తెలిపారు.

అనంతరం తులసీ,ఉసిరి చెట్టుకు పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆడేపు రవీందర్,స్టేట్ వైస్ ప్రెసిడెంట్,కో కన్వీనర్ వడ్నాల నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఉదయం జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజ, తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ పూజ,ఉసిరి చెట్టు పూజ,రుద్రాభిషేకం అనంతరం సామూహిక వన భోజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు,సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పంచ మహా హారతులతో ముగింపు కార్యక్రమం నిర్వహించారు.పద్మశాలీ కుల బందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కుసుమ సతీష్,ఆడేపు వెంకటేష్,ప్రముఖ గ్రానైట్ అధినేత ములుక రాజు,పద్మశాలీ సంఘం నేత మేరుగు అశోక్,పద్మశాలీ సంఘం కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More గత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆర్థిక వ్యవహారాల్లో భారీ అక్రమాలు.- ఒక కన్వెన్షన్ సెంటర్‌కు  రూ. 32 లక్షలు చెల్లింపులు. - నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదు: హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు క‌వి యాకూబ్‌, కార్యదర్శి వాసు.

Tags:  

Advertisement

LatestNews