అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ 

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ 

విశ్వంభర, పరిగి: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి  పాల్గొని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ, అంగన్వాడీ సిబ్బంది సేవలు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి, మహిళల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో డిజిటల్ సేవలు అందించడంలో టీచర్లకు  సౌలభ్యం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, ఎమ్మార్వో వెంకటేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కౌన్సిలర్లు బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, ఆరిఫ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గనిమోని శ్రీనివాస్, గోపాల్, రామకృష్ణారెడ్డి, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: