ఉచిత మెగా క్యాన్సర్ శిబిరంనకు అపూర్వ స్పందన. -ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు
పొగాకుకు దూరంగా ఉండండి..- డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్..
విశ్వంభర, చండూరు : స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సౌజన్యంతో స్థానిక చండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ క్యాంప్ ను గాంధీజీ విద్యాసంస్థలలో నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపు నందు చండూరు వాస్తవ్యులు డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ గారు (క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు) మరియు డాక్టర్ శిరీష గారు (బ్రెస్ట్ సర్జరీ స్పెషలిస్ట్) సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించారు.ఈ క్యాంప్‌ను ఉద్దేశించి డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పొగాకు క్యాన్సర్‌కు కారకమని, పొగాకు వల్ల నోటి క్యాన్సర్ వస్తుందని తెలియజేయడం జరిగింది. కావున ప్రజలందరూ పొగాకును విడనాడాలని సూచించారు. క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తిస్తే భయపడవలసిన అవసరం లేదని, చికిత్స ద్వారా నయం చేయవచ్చునని అన్నారు. ఈ క్యాంపులో మహిళలు ఎక్కువ పాల్గొన్నారని, వీళ్ళందరికీ టెస్టులు చేశామని మూడు రోజుల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది పేషెంట్లు ఉన్నారో తెలుస్తుందని తెలిపారు. అలాగే ఈ క్యాంప్‌ను ఉద్దేశించి చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఉచిత మెగా క్యాన్సర్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి, ఒక్కొక్కరికి పదివేల రూపాయల పరీక్షలను ఉచితంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి క్యాంపులు నిర్వహించడానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అదేవిధంగా భవిష్యత్తులో వివిధ రకాల ఉచిత మెగా క్యాంపులను నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ మేనేజర్ సుమన్, మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోడి గిరిబాబు, కౌన్సిలర్ కోడి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ్, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కటకం రమేష్, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, కొండ్రెడ్డి మధు, సిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, కర్నాటి శీను, చిలుకూరి అశోక్, గజ్జల కృష్ణారెడ్డి, సరికొండ వెంకన్న, నెల్లూరి శ్రీనివాసులు, పున్న సైదులు, పున్న ధర్మేందర్, తదితరులు పాల్గొన్నారు.