శ్రీరామ్ తండాలో గ్రామ సభ .. ప్రజా సమస్యలపై చర్చ
విశ్వంభర, హుస్నాబాద్ :అక్కన్నపేట మండలం శ్రీరామ్ తండా గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బానోతు వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన బానోతు వెంకటేష్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామ సభలో ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించగా వాటిపై సానుకూలంగా స్పందించిన బానోతు వెంకటేష్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ , గ్రామ మహిళలు, యువకులు, రైతులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.