ఏసీబీ వలలో అవినీతి చేప

ఏసీబీ వలలో అవినీతి చేప

  •  సోమారం గ్రామ చౌరస్తాలో సర్వేయర్‌కు లంచం
  •  రూ. 10 వేల తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టివేత
  •  సర్వే సహా ముగ్గురు అదుపులోకి 

విశ్వంభర,  సైదాపూర్ : మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. మండలంలోని అమ్మనగుర్తి గ్రామంలో సర్వే కోసం మండల సర్వేయర్‌ యెక్కలదేవి కుమారస్వామి బాధిత రైతు మహేందర్‌ దగ్గర నుండి శుక్రవారం రూ. 10వేల లంచంను సోమారం గ్రామ చౌరస్తా వద్ద తీసుకుంటుండగా వల పన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు చెందిన 3 ఎకరాల భూమి సైదాపూర్‌ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో ఉంది. మే 17వ తేదిన భూమిని సర్వే చేయాలని తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు మహేందర్‌ దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేయడానికి సదరు సర్వేయర్‌ రూ. 25వేల లంచం డిమాండ్‌ చేశారు. 23వ తేదీన రూ. 5వేలు సర్వేయర్‌ కుమారస్వామి అసిస్టెంట్‌ అయిన రాజేష్‌కు అప్పగించారు. అలాగే సర్వేయర్‌ రెండో అసిస్టెంట్‌ విహిత్‌ రెడ్డికి రూ. 10వేలను అందించారు. మిగతా డబ్బులు శుక్రవారం సైదాపూర్‌ మండలం సోమారం గ్రామ చౌరస్తా వద్ద బాధిత రైతు మహేందర్‌ సర్వేయర్‌ కుమారస్వామికి ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టు-కున్నారు. సర్వేయర్‌ కుమారస్వామితోపాటు అసిస్టెంట్లు- రాజేష్‌, విహిత్‌ రెడ్డిలను అరెస్టు చేసి ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. ఎవరైన ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్‌ చేసిన సందర్భంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కోసం ప్రజలు 1064 సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ కోరారు. ఈకార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు పున్నం చందర్‌, ప్రేంకుమార్‌ లున్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/acb-is-a-corrupt-fish-in-the-net/article-16304

Tags: