ఇనుగుర్తి మండలం లో గ్రామ సభలు
విశ్వంభర, ఇనుగుర్తి: విద్య, వైద్యం, రెవిన్యూ, ఇరిగేషన్, విద్యుత్, డస్ట్ బిన్ విధానం తదితర సమస్యలపై ఇనుగుర్తి మండలంలో ని నాలుగు గ్రామాలలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్, లాలు తండా భూక్య లక్ష్మి వెంకన్న, రాము తండా మీటు నాయక్, అయ్యగారి పల్లి మలిశెట్టి శోభన్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలకు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు ఎంపీడీవో బండారు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత శాఖల ద్వారా అమలవుతున్న,నిర్వహిస్తున్న పనులపై సంబంధిత అధికారులను,గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకురాగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.డస్ట్ బిన్ విధానం పై అవగాహన కల్పించారు. పచ్చ,నీలం,ఎరుపు,నలుపు డబ్బాలో ఏయే చెత్త ఉంచాలో సంబంధిత నిపుణులు వివరించారు.కార్యక్రమంలో ఎంఈఓ రూపా రాణి, ఆర్ఐ బషీర్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ఆయా గ్రామాల ఉప సర్పంచులు,వార్డు సభ్యులు,కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.