ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ
విశ్వంభర, నెల్లికుదురు: ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలలకు ఎంఈవో ఆంగోతు రాందాస్ స్థానిక ఎమ్మార్సీ భవనంలో ఆయా పాఠశాలల హెచ్ఎం లకు, బాధ్యులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు,మధ్యాహ్న భోజనం వంటి ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొంది ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు,ఉపాధ్యాయులు మండల ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ కంప్యూటర్ ఆపరేటర్ ఐఆర్పి యాకయ్య, సిఆర్పిలు ఆశోద భాస్కర్ రావు,బొడ్డు వీరస్వామి,బైరు కవిత,జంపాల కవిత,మెసెంజర్ రత్నపురపు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.