సంబురంగా గృహప్రవేశం..
- మురిసిన ఇందిరమ్మ ఇంటి దంపతులు
విశ్వంభర, ఇనుగుర్తి: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తిచేసుకుని గృహప్రవేశం చేసిన మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు గుర్రం అనిత వెంకన్న దంపతులు మది నిండా సంతోషాన్ని నింపుకొని మురిసిపోయారు.ఎన్నో ఏళ్లుగా ఇల్లు నిర్మించుకోవాలనే కల కాంగ్రెస్ ప్రభుత్వం తో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. గృహప్రవేశం పొందిన అనంతరం గురువారం తమ నూతన ఇంటి ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ.. తన అమ్మానాన్నలు సైతం కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేశారని,ఆర్థిక ఇబ్బందులతో గృహ నిర్మాణం చేపట్టలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టడం మావంటి వారికి ఎంతో ఉప యోగకరమన్నారు. ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ఆదేశాలతో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడంతో గ్రామంలో సుమారు 31 మంది పేదలు మొదటి విడతలో ఇండ్లు కట్టుకున్నట్లు తెలిపారు.ఇప్పటికే 21 ఇండ్ల నిర్మాణం పూర్తి కావడం, గృహప్రవేశాలు చేయడంతో వర్షాకాలపు ఇబ్బందుల నుంచి తమ కుటుంబాలు బయటపడినట్లయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని వారు తెలిపారు.