విద్యా సమస్యలకు సమరశీల పోరాటాలే మార్గం
విశ్వంభర, హిమాయత్‌నగర్ : విద్యారంగ సమస్యలు సమరశీల ఉద్యమాల ద్వారానే పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాదు హిమాయత్‌నగర్‌లోని మగ్ధూం భవన్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను ప్రారంభిస్తూ మాట్లాడారు. ఎఐఎస్ఎఫ్ దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి విద్యా హక్కుల సాధన వరకు కీలక పాత్ర పోషించిందని చెప్పారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ముఖ్యమని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని, పేదలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్, మధుకర్, బి ఎస్ ఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.