నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్' తనిఖీలు

 నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్' తనిఖీలు

 విశ్వంభర, సూర్యాపేట: జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి లాంటి మాదకద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో పట్టణ కేంద్రంలో హోటల్స్, టీ దుకాణాలు, జాతీయ రహదారి వెంట హోటల్స్ దాబాలు, పాన్ డబ్బాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించామని అన్నారు. ప్రస్తుత సమాజంలో గాంజాయి లాంటి మాదకద్రవ్యం మన యువతని సమాజాన్ని పట్టిపీడిస్తుందని దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి  ఉపయోగించేవారు ఉన్నా, సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%C2%A0%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D--%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D--%E0%B0%A4%E0%B0%A8%E0%B0%BF%E0%B0%96%E0%B1%80%E0%B0%B2%E0%B1%81/article-16338

Tags: