విద్య, వైద్యం ప్రైవేటీకరణపై పోరాటం : జాన్ వెస్లీ

విశ్వంభర, హైదరాబాదు : విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణను అడ్డుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు టి జ్యోతి, బండారు రవికుమార్ లతో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల లోపం, ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ ప్రైవేటు విద్య భారీ వ్యాపారంగా మారిందని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, వైద్యుల కొరత ఉండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. వైద్య రంగంలో కూడా ఫీజు నియంత్రణ అవసరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ అమలు చేయాలని కోరారు. తెల్ల రేషన్ కార్డు ద్వారా బియ్యం మాత్రమే కాకుండా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని, పెన్షన్ పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని అన్నారు. ఈ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/john-wesleys-fight-against-privatization-of-education-and-medicine/article-16256

Tags: