మొక్కలు నాటిన మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
విశ్వంభర, హనుమకొండ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ కుడా చైర్మెన్ , ఓబీసీ చైర్మన్ మాస్టర్జీ విద్యా సంస్థల చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ రాంనగర్ లోని ఓబీసీ కార్యాలయం దగ్గర శుక్రవారం రోజున మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం ఒక్క చెట్టైనా నాటితే దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో చెట్లు పెరిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్, ఓబీసీ సెక్రటరీ గడ్డం భాస్కర్, సీనియర్ పాత్రికేయులు గడ్డం కేశవమూర్తి , ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీకాంత్, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.