పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్దం 

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్దం 

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్దం చేసి  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమాలను అవమానించేలా బీజేపీతో అటు వాటి అనుబంధ సంఘాల నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగ్గవని అన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు గడిపే మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాకవి గద్దర్‌ను అవమానించే వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్  మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇటువంటి కుట్రలను తిప్పికొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, కోహెడ కొమురయ్య, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, నాంపల్లి సమ్మయ్య, మండల జంపన్న, చెప్యాల ప్రకాశ్, వేముల జగదీశ్, తొందూరి ఎల్లయ్య, జంగ విజయ, గూడ పద్మ, అక్బర్, పెట్టెం కుమారస్వామి, కొంగల రాంచంద్రరెడ్డి, రమేష్ యాదవ్, యాదగిరి, మాట్ల వెంకటస్వామి, కండె సుధాకర్, పొన్నాల వినోద్, ఎదులాపురం తిరుపతి, బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, లింగచారి, ఐలయ్య, భిక్షపతి, నిర్మల, మ్యాక రమేష్, మ్యాకల సమ్మయ్య, దుర్గం రవీందర్, లింగమూర్తి, రామక్క తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pawan-kalyan-is-an-effigy/article-16278

Tags: