వినోబా భావే నగర్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని వినోబా భావే నగర్‌లో వినోబా భావే నగర్ అభివృద్ధి సమితి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కల నాటకం, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ, యోగా కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి గాంధీ సంస్థల చైర్మన్ డా. గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. రామచంద్ర, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం ఎంఈఓ హీరియా నాయక్, జిల్లా ఎన్‌జీసీ డీఎస్‌ఓ శ్రీనివాస్ రావు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ లక్ష విగ్రహాల కమిటీ కన్వీనర్ గాంధారి ప్రభాకర్, ఆర్‌యూపీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు, గాంధీ సాహితి అధ్యక్షులు కె. గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంబ వెంకటస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు భవాని జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు జగన్, ఎఫ్3సీ సీఈఓ ఎలుగూరి స్రవంతి రెడ్డి, సంఘసేవకులు లింగస్వామి, అరదీప్ రెడ్డి, సుభాష్ చంద్ర, పవన్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. "ఒక్క మొక్క నాటితే వందల మందికి ప్రాణవాయువు అందుతుంది" అని, "ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి ప్రకృతిని కాపాడుకుందాం" అనే సందేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రతిజ్ఞ చేశారు.