టీచర్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు మంజూరైన నేపథ్యంలో, ఆయా పాఠశాలల్లో బోధన నిర్వహణకు బోధకులు, ఆయా పోస్టుల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి మన్నె అగ్గిరాములు తెలిపారు. పూర్వ ప్రాథమిక తరగతుల్లో 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు బోధన అందించేందుకు టీచర్ పోస్టులకు ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్య లేదా ప్రాథమిక బోధనలో ప్రత్యేక అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. ఆయా పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులని, 7వ తరగతి మార్కుల మెమోతో పాటు , కమ్యూనిటీ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఎంపిక ప్రక్రియలో పాఠశాల ఉన్న ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. అదే గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా ప్రాతిపదికన ఎంపికలు చేపడతారని పేర్కొన్నారు.అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం చెల్లించబడుతుందని పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మండల విద్యాశాఖ కార్యాలయం (ఎంఈవో కార్యాలయం)లో ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు నమూనాలు, పోస్టుల వివరాలు సంబంధిత ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.