మండలంలో ఇంకా పూర్తి కాని ధాన్యం కొనుగోళ్ళు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ 51 శాతం మాత్రమే కొనుగోళ్ళు జరిగాయి. ఇంకా 49 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయడానికి సిద్దంగా ఉన్నాయి. మండలంలోని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడంలో కూడా లారీల పంపిణీ కాంట్రాక్టర్లు పక్షపాత వైఖరి చూపిస్తూ, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను పంపడం లేదని, తద్వారా కాంటా వేసిన ధాన్యం రవాణాలో ఆలస్యం అవుతుందని, ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంగా జరగడం లేదని మండలంలోని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు అవుతున్నప్పటికీ ఇంకా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి కాకపోవడం రైతులను తీవ్రంగా కలచివేస్తుంది. ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ధాన్యం కొనుగోళ్ళను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.