ఈనెల 7న ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు.
ప్రజలందరు ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు
విశ్వంభర, చండూరు : చండూరు మున్సిపాలిటీ లో గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు సహకారంతో ఆదివారం నాడు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాదు వారిచే చండూరు వాస్తవ్యులు డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు మరియు డాక్టర్ శిరీష బ్రెస్ట్ శస్త్ర శిక్షిస్తా నిపుణులచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమం నందు సాధారణ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్ లాంటి వాటిని స్క్రీనింగ్ మరియు ఇట్టి క్యాన్సర్ పరీక్షలకు విరామయి స్కాన్, పాప్ సమీర్ టెస్ట్, ఇలాంటి టెస్టులు అవసరమైన వారికి ఉచితంగా అందించబడతాయని అన్నారు. ఈ క్యాంపులో సిగరెట్, బీడీ అలవాటు ఉన్నవారికి, పాన్, గుట్కా, జర్దా, వక్కలు నమిలే వారికి, కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు, రక్తహీనత కలిగిన వారు, మలంలో రక్తము లేదా రక్త చారికలు వచ్చేవారు, అధిక మలబద్ధకం ఉన్నవారు, ఆకలి మందగించడం, బరువు తగ్గేయడం, దగ్గినప్పుడు తెమడలో రక్తం పడేవారు, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునేవారు, మూత్రంలో రక్తం పడేవారు, అధిక తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం మొదలైన లక్షణాలు ఉన్నవారు ఈ క్యాంపు నందు డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరి వెంట కర్నాటి శ్రీనివాసులు, చిలుకూరి అశోక్ లు ఉన్నారు.