ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 

విశ్వంభర, హాలియా: హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జెడ్పిహెచ్ఎస్  హలియా స్కూల్ లో  మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ చెట్ల సంరక్షణలో భాగస్వాములు అయ్యి ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను వారి అమ్మ గారి పేరు మీద నాటి , సంరక్షించాల్సింది పచ్చదనాన్ని పెంపొందించి - కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతల్లో మార్పు  దృష్ట్యా రానున్న భావితరాల వారికి మంచి వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరు  చెట్లను నాటి వాటి సంరక్షణ కూడా చేపట్టినప్పుడే పర్యావరణాన్ని కాపాడిన, కాలుష్యాన్ని తగ్గించిన వారవుతాం అని చెప్పారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ గారు, 8వ వార్డు కౌన్సిలర్ సలహాదారులు మజహార్ మొయినుద్దీన్ గారు, 9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు గారు, కోఆప్షన్ సభ్యులు ఎండి రషీద్ గారు , జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పుర ప్రముఖులు, మునిసిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-world-environment-day/article-16284

Tags: